deve gowda: దేవెగౌడను పొగిడిన నోటితోనే... ఓటు వేయవద్దని కోరిన మోదీ

  • మూడు రోజుల క్రితం దేవెగౌడపై పొగడ్తల వర్షం కురిపించిన మోదీ
  • తాజాగా జేడీఎస్ కు ఓటు వేయవద్దని కోరిన ప్రధాని
  • జేడీఎస్ కు ఓటు వేయడం మంచి నిర్ణయం కాదన్న మోదీ

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి కూడా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలాగే అప్పుడప్పుడు ఒకర్ని మరొకరు పొగుడుకుంటున్నారు కూడా. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇందుకు అతీతుడు కాదు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడను ముడు రోజుల క్రితమే మోదీ పొగిడిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆయన మాట మార్చేశారు. కర్ణాటకలోని ఓ ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ, జేడీఎస్ కు ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు. మీరు ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తుందని చెబుతారని... ఈ నేపథ్యంలో, అలాంటి పార్టీకి ఓటు వేయడం మంచి నిర్ణయం కాదని చెప్పారు.

మరోవైపు, దేవెగౌడపై మోదీ ప్రశంసలు కురిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. దేవెగౌడ కూడా దాన్ని నమ్మలేకపోయారు. అయినా జేడీఎస్, బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ లతో పాటు మరికొందరు మిత్రుల సహకారంతో కర్ణాటకలో తాము కచ్చితంగా అధికారాన్ని చేపడతామని దేవెగౌడ అన్నారు.

More Telugu News