risk with car jouney: కారులో సుదీర్ఘ సమయం ప్రయాణిస్తే చిక్కులే... రక్తం గడ్డ కట్టొచ్చంటున్న తాజా పరిశోధన
- జపాన్ భూకంపం తర్వాత కార్లలో చిక్కుకుపోయిన వారిపై పరిశోధన
- బాధితుల్లో వీటీఈ సమస్య
- ఎక్కువ సమయం కదలకుండా ప్రయాణిస్తే వచ్చే సమస్యలపై అప్రమత్తత
కారులో ఎక్కువ గంటల పాటు ప్రయాణిస్తుంటారా.. లేక విమానాల్లోనూ సుదీర్ఘ సమయం పాటు ప్రయాణించే అలవాటు ఉందా..? ఈ తరహా వ్యక్తులు వీన్ త్రోంబో ఎంబాలిజమ్ (వీటీఈ) సమస్య బారిన పడే ప్రమాదం ఉంటుందని తాజా పరిశోధన ఒకటి హెచ్చరించింది. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డం కట్టే పరిస్థితి ఇది. 2016 ఏప్రిల్ లో జపాన్ లోని కుమమోటో భూకంపం తర్వాత కార్లలో సుదీర్ఘ సమయం చిక్కుకుపోయిన వారిపై అధ్యయనం నిర్వహించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
నాటి భూకంపం తర్వాత ఎక్కువ సమయం పాటు వాహనాల్లో చిక్కుకుని తర్వాత ఆస్పత్రి పాలైన 51 మంది రోగులను ప్రశ్నించి వివరాలు రాబట్టగా, ఈ పరిశోధనా ఫలితాలు కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. 51 మంది రోగుల్లో 42 మంది తమ వాహనంలో రాత్రంతా గడిపి వీటీఈ సమస్యతో బాధపడిన వారే. కదల్లేని స్థితిలో ఎక్కువ సమయం పాటు గడిపితే వచ్చే ముప్పుకి ఇదొక ఉదాహరణగా కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టాన్లీ నట్టెల్ పేర్కొన్నారు