actress: టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నానన్న టాలీవుడ్ సీనియర్ నటి

  • టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్న మాట నిజమే
  • సినీ పరిశ్రమకు ఏదైనా చేయాలనే ఆశ ఉంది
  • గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశా
టాలీవుడ్ సీనియర్ నటి సంగీత టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల కాలంలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ షోలో ఆమె క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా సినీ పరిశ్రమకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే ఆశ తనకు ఉందని ఆమె చెప్పారు. పేద కళాకారులకు ప్రభుత్వం తరపున సాయం అందేలా చేస్తే చాలని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని... ప్రభుత్వం తరపున సినీ పరిశ్రమకు ఏదైనా చేస్తే బాగుంటుందని ఆ సందర్భంలో ఆయనకు చెప్పానని తెలిపారు. ఏదైనా సాయం చేయడానికి కావాల్సినంత డబ్బు తన వద్ద లేదని, అందుకే ప్రభుత్వం అండతో చేయాలనుకుంటున్నానని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్న మాట నిజమేనని... అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తనది వరంగల్ అని చెప్పారు. తనకు పదవీ వ్యామోహం లేదని, కేవలం కార్యకర్తగానే టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నానని తెలిపారు. 
actress
sangeetha
TRS
tollywood

More Telugu News