Narendra Modi: ‘ఉమెన్ ఫస్ట్’ అన్నది మా మంత్రం: ప్రధాని మోదీ

  • మహిళాభివృద్ధి నుంచి మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా మార్పు
  • బూత్ స్థాయిలో పనిచేసి గెలవాలి
  • కర్ణాటక బీజేపీ మహిళా కార్యకర్తలకు పిలుపు
‘మహిళే ముందు’ అన్నది తమ ప్రభుత్వం, బీజేపీ మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళాభివృద్ధి నుంచి దేశం మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా మారుతోందన్నారు. కర్ణాటక బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి నరేంద్రమోదీ యాప్ ద్వారా మాట్లాడారు. బూతు స్థాయిలో దృష్టి పెట్టడం ద్వారా మే 12 నాటి ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు.

సమర్థత కలిగిన మహిళలకు తన కేబినెట్ లో చోటిచ్చినట్టు చెప్పారు. చైనాలో జరిగిన సదస్సులో భారత్ నుంచి సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ మాత్రమే పాల్గొన్నట్టు గుర్తు చేశారు. ఈ ఇద్దరికీ కర్ణాటకతో సంబంధం ఉందన్నారు. మహిళా కార్యకర్తల సేవలను కొనియాడుతూ బూత్ స్థాయిలో విజయానికి పాటు పడాలని కోరారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ మహిళా నేతలను గుర్తు చేసుకున్నారు. ఇస్రో మంగళయాన్ ప్రాజెక్టులో ప్రత్యేకంగా మహిళా బృందం పనిచేసినట్టు చెప్పారు.
Narendra Modi
Karnataka ELECTIONS

More Telugu News