Guntur District: చచ్చిపోతున్నానని ఫోన్ చేసిన దాచేపల్లి మృగాడు!

  • దాచేపల్లిలో బాలికపై అత్యాచారం
  • ఆపై కనిపించకుండా పోయిన సుబ్బయ్య
  • కృష్ణానదిలో వెతుకుతున్న పోలీసులు
గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు సుబ్బయ్య, తన బంధువులకు ఫోన్ చేసి, తాను చనిపోతున్నట్టు చెప్పాడు. బుధవారం రాత్రి ఆయన ఫోన్ చేయగా, ఇంత ఘోరం ఎందుకు చేశావని బంధువులు అడుగగా, తానింక బతకనని, చనిపోతున్నానని చెప్పినట్టు తెలుస్తోంది.

 ఈ విషయాన్ని సుబ్బయ్య బంధువులు వెంటనే పోలీసులకు తెలిపారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేయగా, అది అక్కడికి సమీపంలోనే ఉన్న కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ ను చూపించింది. దీంతో సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న కోణంలో పోలీసులు పడవలను రంగంలోకి దించి, నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు.
Guntur District
Dachepalli
Rape
Subbaiah

More Telugu News