Rahul Gandhi: భివండి కోర్టు ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు

  • మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్లే హత్య చేశారన్న రాహుల్ 
  • మహారాష్ట్రలోని భివండి కోర్టులో ఈ కేసు విచారణ
  • ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలంటూ రాహుల్ కు నోటీసులు
మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్లే హత్య చేశారంటూ నాడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. 2014 మార్చి 6న మహారాష్ట్రలోని థానేలోని భివండి వద్ద ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆర్ఎస్ఎస్ ప్రతిష్టతకు భంగం వాటిల్లిందంటూ కార్యకర్త రాకేశ్ కుంటే భివండి కోర్టును ఆశ్రయించారు. రాహుల్ పై పరువునష్టం దావా వేశారు.

ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ తరపు న్యాయవాది సమర్పించిన వివరణపై వాదనలు వింది. ఈ కేసు తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని, న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.  
Rahul Gandhi
rss

More Telugu News