padmarao: హైదరాబాద్‌లో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు: మంత్రి పద్మారావు

  • హైదరాబాద్‌లో అకాల వర్ష బీభత్సం
  • పలు ప్రాంతాల్లో నేలకూలిన చెట్లు 
  • పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి పద్మారావు
  • ఫిర్యాదు అందిన వెంటనే బృందాలను పంపుతున్నామని వ్యాఖ్య

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలి వాహనాలపై పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, పోలీసులు పలు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.  

నగరంలో పలు కాలనీల్లో మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్‌ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ... నగరంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. వర్షం ప్రారంభమవుతుండగానే అత్యవసర బృందాలు రంగంలోకి దిగుతాయని, చెట్లు కూలిన చోటికి వెళ్లి తొలగిస్తున్నామని అన్నారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిన వెంటనే బృందాలను పంపుతున్నామని తెలిపారు.                  

  • Loading...

More Telugu News