nannapaneni rajakumari: బాధితురాలి కుటుంబానికి అండగా వుంటాం: నన్నపనేని

  • దాచేపల్లిలో చిన్నారిపై జరిగిన ఘటన దారుణం
  • నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం
  • రేపిస్టులను గ్రామాల నుంచి వెలి వేయాలి
కామాంధులను గ్రామాల నుంచి బహిష్కరించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు. దాచేపల్లిలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మరోవైపు దాచేపల్లిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 50 ఏళ్ల పైబడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 
nannapaneni rajakumari
dachepalli

More Telugu News