Krishna District: కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

  • గన్నవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
  • మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలో మోస్తరు వర్షం
  • విజయవాడలో భారీవర్షం
  • రహదారులు జలమయం
కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆ జిల్లాలోని గన్నవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలో మోస్తరు వర్షం పడుతోంది. విజయవాడలో భారీవర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

కృష్ణా జిల్లాలో మరోసారి పిడుగులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం సమీక్ష జరిపి అధికారులను అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.    
Krishna District
rain

More Telugu News