vijay: విజయ్ సినిమాతో బిజీగా మురుగదాస్

  • మురుగ దాస్ దర్శకత్వంలో విజయ్ 
  • 45 శాతం చిత్రీకరణ పూర్తి 
  • దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన    

తెలుగులో మహేశ్ బాబుతో చేసిన 'స్పైడర్' భారీ పరాజయాన్ని చవిచూడటంతో, ఆ తరువాత సినిమాను విజయ్ తో ప్లాన్ చేసుకున్నాడు మురుగదాస్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ ఉండగా, తమిళనాట చిత్రపరిశ్రమకి సంబంధించిన సమ్మె జరిగింది.

అప్పుడు ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే మొదలై రెండవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పటివరకూ 45 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇక మూడవ షెడ్యూల్ కోసం రంగంలోకి దిగడానికి మురుగదాస్ .. విజయ్ రెడీ అవుతున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, దీపావళికి విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News