Kedarnath: కేదార్ నాథ్ కు కాలినడకన వెళ్లిన అనుష్క... ఫొటోలు వైరల్!

  • ట్రెక్కింగ్ చేస్తూ స్వామి దర్శనానికి
  • తిరుగు ప్రయాణంలో గుర్రం సాయం
  • సెల్ఫీలకు ఆసక్తి చూపిన యాత్రికులు
దక్షిణాది బ్యూటీ అనుష్క శెట్టి, కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ, పవిత్ర కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లి పరమశివుడిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం 17 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు అనుష్క గుర్రం ఎక్కింది. మరో ఇద్దరితో కలసి కేదార్ నాథ్ వచ్చిన అనుష్క, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.

కాగా, అతికొద్దిమంది మాత్రమే అనుష్కను గుర్తించడం గమనార్హం, గుర్తించిన వారు పలకరించి, ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తిని చూపారు. బ్లూ కలర్ కోట్ వేసుకుని వచ్చిన అనుష్కతో సెల్ఫీలు దిగిన వారు, బాహుబలి హీరోయిన్ అంటూ తమతమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని పోస్టు చేసుకుని ఆనందిస్తున్నారు.
Kedarnath
Anushka
Trekking

More Telugu News