cape town: జూ యజమానిపైకి దూసుకొచ్చి.. దాడి చేసిన సింహం.. వీడియో వైరల్‌

  • కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్క్ లో ఘటన
  • జూ యజమానికి గాయాలు 
  • లాక్కెళ్లి మరీ దాడి చేసిన వైనం

జూ యజమానిపైకి దూసుకొచ్చి దాడి చేసి, ఆయనను తీవ్ర గాయాలపాలు చేసింది ఓ సింహం. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌ అవుతోంది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వన్య మృగాలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో నిరూపిస్తోంది.

ఆ పార్క్‌ ఓనర్ మైక్ హాడ్జ్ ఓ సింహం ఎన్‌క్లోజర్లోకి వెళ్లాడు. ఆయనను చూసిన ఆ సింహం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చింది. ఆయన పరుగులు తీసినప్పటికీ సింహం ఆయన మెడపట్టుకుని లాక్కొచ్చింది. అనంతరం అతనిపై దాడి చేసింది. చివరకు ఆయనను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

More Telugu News