'ఛలో' దర్శకుడితో నితిన్ .. కథానాయికగా మెహ్రీన్
- నితిన్ హీరోగా సెట్స్ పై 'శ్రీనివాస కల్యాణం'
- నెక్స్ట్ మూవీ వెంకీ కుడుములతో
- నితిన్ సొంత బ్యానర్లో నిర్మాణం
తాజాగా నితిన్ జోడీగా చేసే ఛాన్స్ అమ్మడికి దక్కడం విశేషం. ప్రస్తుతం నితిన్ .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. 'శ్రీనివాస కల్యాణం' షూటింగ్ పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు.