కోట బురుజులు, గోడలు బద్దలు... చెన్నంపల్లి కోటలో శరవేగంగా నిధి అన్వేషణ!
- నాలుగో విడత తవ్వకాలు ప్రారంభం
- మూడు రోజులుగా సాగుతున్న అన్వేషణ
- భారీ యంత్రపరికరాలతో తవ్వకాలు
బురుజుల నుంచి భూ గృహాలకు దారి ఉండవచ్చన్న ఆలోచనతో ఈ పని చేస్తున్నట్టు సమాచారం. ఇంతవరకూ కోటలో ఎటువంటి నిధి జాడ తెలియరాకపోయినా, స్కానర్లతో పరిశీలిస్తుంటే లోహం కనిపిస్తుండటంతో, అధికారుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో లోహపు ఆనవాళ్లు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతానికి దారి కనుగొంటామని అధికారులు అంటున్నారు.