మరో ఐదు రోజులు 'పెట్రో' ధరలు మారవు: స్పష్టం చేసిన ఓఎంసీలు
- రెండు వారాల పాటు ధరలను సవరించబోము
- ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి
- ఇప్పటికే ఎనిమిది రోజులుగా మారని ధరలు
కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే, ప్రజల్లో వ్యతిరేక రాకుండా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్ ధరలను సవరించరాదని ఓఎంసీలకు ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో క్రూడాయిల్ ధరలు రెండు డాలర్లకు పైగా పెరగడంతో ఎన్నికలు కాగానే ఒక్కసారిగా ధరాభారం ప్రజలపై పడుతుందన్న ఆందోళన నెలకొని ఉంది. ఇదిలావుండగా, ధరలు మారకపోవడంపై తమను నోరు తెరవరాదన్న ఆదేశాలున్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.