Petrol: మరో ఐదు రోజులు 'పెట్రో' ధరలు మారవు: స్పష్టం చేసిన ఓఎంసీలు

  • రెండు వారాల పాటు ధరలను సవరించబోము
  • ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి
  • ఇప్పటికే ఎనిమిది రోజులుగా మారని ధరలు

కనీసం మరో ఐదు రోజుల పాటు పెట్రోలు, డీజెల్ ధరలు పెరగబోవు. ఈ విషయాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను రెండు వారాల పాటు పెంచరాదని నిర్ణయించామని, ఈ నిర్ణయం ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వస్తుందని తెలిపాయి. అయితే, ఎందుకు ధరలను సవరించడం లేదన్న విషయాన్ని మాత్రం అవి వెల్లడించలేదు. కాగా, గడచిన ఎనిమిది రోజులుగా 'పెట్రో' ఉత్పత్తుల ధరలు మారడం లేదన్న సంగతి తెలిసిందే.

కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే, ప్రజల్లో వ్యతిరేక రాకుండా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్ ధరలను సవరించరాదని ఓఎంసీలకు ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో క్రూడాయిల్ ధరలు రెండు డాలర్లకు పైగా పెరగడంతో ఎన్నికలు కాగానే ఒక్కసారిగా ధరాభారం ప్రజలపై పడుతుందన్న ఆందోళన నెలకొని ఉంది. ఇదిలావుండగా, ధరలు మారకపోవడంపై తమను నోరు తెరవరాదన్న ఆదేశాలున్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News