Telangana: మా ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా వదలకుండా తిడుతున్నారు!: ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ కేటీఆర్

  • కేసీఆర్ దిష్టిబొమ్మలు కాల్చి ఆయన దిష్టి తీసేశారు
  • మీ ఒంటి నిండా విషమే 
  • కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు 

ప్రతిపక్షాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై దుమ్మెత్తి పోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తమ కుటుంబ సభ్యులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, చివరికి చిన్న పిల్లలను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తిట్టే తిట్లన్నీ తమకు దీవెనలుగా మారతాయని అన్నారు.

 ప్రగతి భవన్ పాటకీలు తెరుచుకోవడం లేదని,  వాటిని బద్దలు కొడతామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడని పేర్కొన్న ఆయన ప్రగతి భవన్ పాటకీలు బద్దలు కొట్టడం కాదని, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ప్రగతి నిరోధకుల కోసం ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవని తెగేసి చెప్పారు. నిండా విషం నింపుకున్న వారి కోసం ఎందుకు తెరవాలని ప్రశ్నించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు కాల్చి ఆయన దిష్టిని తీసేశారని అన్నారు. కార్మికుల సమస్యలను కేసీఆర్ చాలా వరకు పరిష్కరించారని, మిగిలిన వాటిని కొంత ఆలస్యమైనా పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News