KTR: కాబోయే నాయకుడు కేటీఆర్: నాయిని

  • భవిష్యత్తు నాయకుడు కేటీఆరే
  • కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావు
  • ఒక పెద్ద మనిషి పెట్టిన పార్టీ వెనుక జనాలే లేరు
తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా లభించవని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఒక పెద్ద మనిషి పార్టీ పెట్టారని... అయితే ఆయన వెంట ఎవరూ లేరని, ప్రజలంతా  టీఆర్ఎస్ వెనకే ఉన్నారని కోదండరామ్ ను ఉద్దేశించి అన్నారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు. అసంఘటిత కార్మికులపై రేపటి నుంచి సర్వే చేయించనున్నామని... అందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.  
KTR
nayini narsimha reddy
TRS
kodandaram
KCR

More Telugu News