sangeta: అప్పుడు బాపుగారు తిట్టేశారు .. ఏడుపు ఆగలేదు: సీనియర్ నటి సంగీత

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై తెలుగుదనంతో కూడిన కథలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో బాపు ఒకరు. ఆయన దర్శకత్వంలో సంగీత 6 .. 7 సినిమాలు చేశారు. ఓ సారి ఆయన సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటనను గురించి ఆమె ప్రస్తావించారు. "బాపు గారి దర్శకత్వంలో 'పెళ్లికొడుకు' సినిమా షూటింగ్ జరుగుతోంది. చాలామంది జూనియర్ ఆర్టిస్టుల కాంబినేషన్లో ఓ సీన్ ను చిత్రీకరిస్తున్నారు.

"లంచ్ తరువాత నా కాంబినేషన్లో చేసే ఆర్టిస్ట్ రాలేదు కదా అని నేను ఒక చోటున కూర్చుని రిలాక్స్ అవుతున్నాను. అప్పుడు బాపుగారు అక్కడికి వచ్చారు. 'ఎందుకొస్తారమ్మా సినిమాలకి .. అవతల అంతమంది ఆర్టిస్టులు ఎదురుచూస్తుంటే .. " అంటూ పెద్దగా అరిచేశారు. ఆ షాట్ అయిన తరువాత నేను బాగా ఏడ్చేశాను. ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ .. 'వస్తానండి' అని చెబితే, 'ఎవరినీ ఏమీ అనలేక నిన్ను అరిచాను .. నువ్ నా కూతురు లాంటిదానివి కదమ్మా" అన్నారు. 'దాంతో మళ్లీ నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి' అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
sangeta
bapu

More Telugu News