Pakistan: బ్రిటన్‌ హోం మంత్రి పదవి చేపట్టిన పాకిస్థాన్‌ మూలాలున్న వ్యక్తి

  • 1960ల్లో బ్రిటన్‌కు వలస వచ్చిన సాజిద్‌ కుటుంబం
  • 2010 నుంచి ఎంపీగా కొనసాగుతున్న వైనం ‌
  • కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా రాణింపు

పాకిస్థాన్‌ మూలాలున్న ఓ వ్యక్తికి బ్రిటన్‌లో ఉన్నత పదవి దక్కింది. పాక్‌కు చెందిన సాజిద్‌ జావిద్‌ (48) కుటుంబం ఉపాధి నిమిత్తం 1960ల్లో బ్రిటన్‌కు వలస వచ్చింది. సాజిద్‌ తండ్రి బస్సు డ్రైవర్‌గా పని చేసేవారు. ఆసక్తి కొద్దీ రాజకీయాల్లోకి ప్రవేశించిన సాజిద్‌ 2010 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కన్సర్వేటివ్‌ పార్టీలో రాణిస్తోన్న ఆయన నిన్నటి వరకు కమ్యూనిటీలు, స్థానిక ప్రభుత్వం, గృహనిర్మాణ మంత్రిగా ఉన్నారు. బ్రిటన్‌ హోం మంత్రిగా ఉన్న యాంబర్‌ రడ్‌ తాజాగా రాజీనామా చేయడంతో తాజాగా ఆ పదవి సాజిద్‌కు లభించింది. ఈ సందర్భంగా సాజిద్ మాట్లాడుతూ... దేశ వలస విధానాన్ని సమీక్షిస్తానని హామీలు ఇస్తారు.

More Telugu News