వేలాది కోట్ల రూపాయలను నష్టంగా చూపించిన ‘స్నాప్ డీల్’
- 2017-18లో రూ.4,647 కోట్ల నష్టం
- అంతకుముందు సంవత్సరంలో రూ.3,340 కోట్ల నష్టం
- ఆదాయంలోనూ క్షీణత
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1,478 కోట్ల కంటే 12 శాతం తగ్గింది. అయితే, తమ పనితీరును మెరుగుపరుచుకున్నామని, నిర్వహణ నష్టాలు 25 శాతం తగ్గినట్టు స్నాప్ డీల్ తెలిపింది. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తో పోటీ పడలేక స్నాప్ డీల్ మార్కెట్ వాటాను క్రమంగా కోల్పోతూ వచ్చింది. నష్టాల్లో ఉన్నా గతేడాది ఈ సంస్థను 950 మిలియన్ డాలర్లకు కొనేందుకు ఫ్లిప్ కార్ట్ ముందుకు రాగా, స్నాప్ డీల్ వ్యవస్థాపకులు కునాల్ బాహ్, రోహిత్ భన్సాల్ అంగీకరించలేదు.