Karnool: అపార నిధికి దారెక్కడ?... చెన్నంపల్లి కోటలో తిరిగి తవ్వకాలు మొదలు!

  • మరోసారి తవ్వకాలు ప్రారంభం
  • లోహపు నిల్వలను చూపుతున్న స్కానర్లు
  • బయటి నుంచి తెచ్చిన కూలీలతో తవ్వకాలు

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచి ఉంచారని భావిస్తున్న అపార నిధికోసం ప్రభుత్వం మరోసారి తవ్వకాలు ప్రారంభించింది. గతంలో రెండు పర్యాయాలు కోటలోని పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పటికీ నిధి జాడ తెలియరాని సంగతి అందరికీ తెలిసిందే. అయితే పాడు బడిన బావి, రాతిపై చెక్కిన శిల్పాలు, రహస్య సంజ్ఞలతో కూడిన గుర్తులు, రాజులు వాడిన ఇనుప కత్తులు, కొందరి ఆస్థిపంజరాలు ఇక్కడ లభ్యమయ్యాయి.

వాటిని విశ్లేషించిన పురావస్తు, మైనింగ్ అధికారులు, ఇటీవల మరోసారి అత్యాధునిక స్కానర్లతో కోట పరిసరాలను పరిశీలించగా, భారీ ఎత్తున లోహం ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో మరోసారి కోటను తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆ ప్రాంత ప్రజలను రానీయకుండా బయటి నుంచి తెచ్చిన కూలీలతో పనులు జరిపిస్తున్నారు.

More Telugu News