Saudi Arebia: సౌదీ అరేబియాలో ఉగ్రదాడికి పాల్పడింది భారతీయుడే: నిర్ధారించిన ప్రభుత్వం

  • రెండేళ్ల క్రితం జెడ్డా యూఎస్ ఎంబసీ ముందు ఉగ్రదాడి
  • డీఎన్ఏ నమూనాలను ఎన్ఐఏకు ఇచ్చి నిర్ధారించుకున్న సౌదీ
  • అధికారిక ప్రకటన వెల్లడి

రెండు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఓ భారతీయుడని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూలై 4, 2016న మూడు ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన నలుగురు వరుస ఆత్మాహుతి దాడులకు దిగగా, అందులో ఫయాజ్ కాగ్జీ అనే ఇండియన్ ఉన్నాడని తెలిపింది. అతను యూఎస్ కాన్సులేట్ ఎదుట దాడికి పాల్పడ్డాడని, తాను తెచ్చిన బాంబులను పేల్చి ఆత్మాహుతి చేసుకున్నాడని వెల్లడించింది.

అతని వివరాలను, దాడికి సంబంధించిన దృశ్యాలను 2017లో ఎన్ఐఏకు పంపిన సౌదీ అరేబియా అతని వివరాలను నిర్ధారించుకుంది. కాగ్జి డీఎన్ఏ నమూనాలను సరిపోల్చిన భారత్, అతను భారతీయుడేనని తేల్చి చెప్పడంతో సౌదీ అధికారులు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. కాగా, 2006లోనే పాక్ కు వెళ్లిన ఫయాజ్ కాగ్జీ, అక్కడే ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ పొంది విధ్వంసాలకు దిగాడు. కాగా, 2006లో ఔరంగాబాద్ లో అక్రమంగా ఆయుధాలను రవాణా చేసిన కేసుతో పాటు, ముంబైపై జరిగిన ఉగ్రదాడి వెనుకా కాగ్జీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News