Sri Reddy: డబ్బుల కోసం 'మా' పెద్దలు డల్లాస్ వెళితే.. అక్కడి వాళ్లు నిరసన వ్యక్తం చేశారట!: శ్రీరెడ్డి

  • నిధుల కోసం డల్లాస్ లో సినీ పెద్దల పర్యటన
  • హోదా కోసం నినాదాలు చేసిన ఎన్నారైలు
  • ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటో పోస్టు చేసిన శ్రీరెడ్డి
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పెద్దలు డల్లాస్ లో నిధుల కోసం పర్యటించిన వేళ, పెద్దగా స్పందన రాలేదని టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి ఓ ఫొటో పోస్టు చేసింది. "అమెరికాలో మా అసోసియేషన్ నిర్వహించిన ప్రోగ్రామ్... అదేనండీ బిల్డింగ్ కోసం డబ్బులు అడగడం కోసం. ప్రోగ్రామ్ కి జనాలు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. హీరోస్ ఎవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడట్లేదని అలిగారంట" అని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఈ ఫొటోలో ఖాళీ కుర్చీలు చాలానే కనిపిస్తుండటం గమనార్హం. ఆ ఫొటో ఇదే.
Sri Reddy
Dallas
MAA
Empty Chairs

More Telugu News