Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చాలా నేర్చుకున్నానంటున్న తమన్నా
  • విశాల్ 'అభిమన్యుడు' రిలీజ్ డేట్ 
  • విలన్ గా మారిన ప్రముఖ రచయిత!    
*  ప్రతి సినిమా తనకొక పాఠమే అంటోంది కథానాయిక తమన్నా. "ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాం. నా వరకు వస్తే, బాహుబలి సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు నేర్చుకున్నాను. 'నా నువ్వే' సినిమా కోసం ఓ నృత్య రూపకం ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు 'సైరా' కోసం కూడా ఎంతో నేర్చుకుంటున్నాను' అని చెప్పింది తమన్నా.
*  విశాల్, సమంత కలసి నటించిన 'అభిమన్యుడు' (తమిళంలో ఇరుంబు తిరై) చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 11న ఒకేసారి విడుదల చేస్తున్నారు. విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించాడు.      
*  ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఆర్టిస్టుగా మారుతున్నాడు. 'వినాయకుడు' ఫేం సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో అబ్బూరి రవి విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆయన షూటింగులో కూడా జాయిన్ అయినట్టు సమాచారం.   
Thamanna
vishal
samantha

More Telugu News