jee: జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 ర్యాంకుల విడుదల.. సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

  • jeemains.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్‌లలో లభ్యం
  • విజయవాడ విద్యార్థి సూరజ్‌ కృష్ణ (350)కు మొదటి ర్యాంకు
  • విశాఖకు చెందిన హ‌న్మంత్ (350)కు రెండో ర్యాంకు

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం ఇటీవల సీబీఎస్‌ఈ నిర్వహించిన ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు ఏపీ నుంచి సుమారు 80 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. jeemains.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్‌లలో ఫలితాలు లభ్యమవుతున్నాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడకు చెందిన విద్యార్థి సూరజ్‌ కృష్ణ 350 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, విశాఖపట్నానికి చెందిన చెందిన హ‌న్మంత్ రెండో 350 మార్కులతో మూడో ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన విద్యార్థి గట్టు మైత్రేయ ఐదో ర్యాంకు సాధించాడు.
 
కాగా, జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-2 ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలను దేశంలోని మొత్తం 112 కేంద్రాల్లో ఇటీవల నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10,43,739 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మే 20న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 2 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News