Gujarath: అలా చూస్తే అంబేద్కర్ కూడా బ్రాహ్మణుడే!: గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • పనిని బట్టి శ్రీరాముడు క్షత్రియుడయ్యాడు
  • శ్రీకృష్ణుడు ఓబీసీ
  • అంబేద్కర్ బ్రాహ్మణుడని చెప్పవచ్చు
  • మోదీ కూడా బ్రాహ్మణుడని సగర్వంగా చెప్పగలను

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... అభ్యాసం చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్లంతా బ్రాహ్మణులేనని, ఇంటి పేరు చూస్తే కూడా అంబేద్కర్ బ్రాహ్మణుడని చెప్పవచ్చని అన్నారు. ఎందుకంటే, ఆ ఇంటి పేరును ఇచ్చిన ఉపాధ్యాయుడు కూడా బ్రాహ్మణుడేనని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ కూడా బ్రాహ్మణుడని తాను సగర్వంగా చెప్పగలనని, జ్ఞానాన్ని సముపార్జించిన వారంతా బ్రాహ్మణులేనని అన్నారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండడంతో మళ్లీ స్పందించి... కులం అనేది పుట్టుకతో వచ్చేది కాదని, ఒక వ్యక్తి పనిని బట్టే అతడికి కులం వర్తిస్తుందని అన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో చేసే పనిని అనుసరించి బ్రాహ్మణుడవుతాడని అన్నారు. అంతేగాక, బ్రాహ్మణులే దేవుళ్లను తయారు చేస్తున్నారని, పనిని బట్టి శ్రీరాముడు క్షత్రియుడు అయ్యాడని, ఇక శ్రీకృష్ణుడు ఓబీసీ అని ఆయన అన్నారు. ఆ ఓబీసీని దేవుడిగా చేసింది సాందీప ముని అని, ఆయన ఓ బ్రాహ్మణుడని అన్నారు.

More Telugu News