dundigal: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడవి పందుల ఆటంకాలు... కాల్చి చంపిన నవాబ్ షఫత్ అలీ ఖాన్!

  • 1500 ఎకరాల్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ
  • అడవి పందుల బెదడతో శిక్షణకు ఆటంకం
  • 11వ తేదీన శిక్షణ పొందుతున్న వారిపై దాడి

హైదరాబాదులోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వైమానిక శిక్షణకు, జెట్ విమానాల ల్యాండింగ్ కు ఆటంకం కలిగిస్తున్న అడవి పందులను హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ కాల్చి చంపారు. తన బృందంతో పాటు కలసి వచ్చిన ఆయన 50 అడవి పందులను చంపారు.

వైమానిక శిక్షణ పొందుతున్న వారిపై ఈ నెల 11న అడవి పందులు దాడి చేశాయి. అంతేకాదు, తరచుగా రన్ వే పైకి వచ్చి, జెట్ విమానాల ల్యాండింగ్ కు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో, తెలంగాణ అటవీశాఖకు ఎయిర్ ఫోర్స్ అధికారులు లేఖ రాశారు. 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అకాడమీలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉందని లేఖలో పేర్కొన్నారు. దీంతో, అటవీశాఖ అనుమతితో పందులను చంపి, వాటిని గుంత తీసి పూడ్చిపెట్టామని నవాబ్ షఫత్ అలీఖాన్ తెలిపారు. 

More Telugu News