Krishna District: నా అల్లుడు, కొడుకూ చేయలేని పని జగన్ చేస్తానన్నారు... పట్టలేని సంతోషంగా ఉంది: లక్ష్మీ పార్వతి

  • కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పిన జగన్
  • నిమ్మకూరులో సాగుతున్న పాదయాత్ర
  • జగన్ ప్రకటనను స్వాగతించిన లక్ష్మీపార్వతి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరును పెడతానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్వాగతించారు. తన అల్లుడు చంద్రబాబునాయుడు, కొడుకు బాలకృష్ణ చేయలేని పనిని జగన్ చేస్తానని చెప్పడంతో తనకు పట్టలేని సంతోషంగా ఉందని ఈ ఉదయం వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై జగన్ అలుపెరగని పోరాటం చేస్తుంటే, తెలుగుదేశం నేతలు చిత్తశుద్ధి లేని డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు.

కాగా, కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్, నిమ్మకూరును చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కృష్ణా జిల్లాకు తాను ఎన్టీఆర్ పేరు పెడతానని ఆయన ప్రకటించిన వేళ, ప్రజలు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. నీరు - చెట్టు కార్యక్రమంలో దోపిడీ జరుగుతోందని నందమూరి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచే తనకు ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.
Krishna District
Jagan
Lakshmiparvati
Telugudesam
YSRCP

More Telugu News