coolpad cool 2: ఫుల్ స్క్రీన్ తో కూల్ ప్యాడ్ కూల్ 2 స్మార్ట్ ఫోన్... చైనాలో విడుదల

  • 5.7 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే
  • 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ
  • దుమ్ము, నీటి నుంచి రక్షణ

చైనాకు చెందిన కూల్ ప్యాడ్ కంపెనీ కూల్ ప్యాడ్ కూల్ 2 స్మార్ట్ ఫోన్ ను స్వదేశం(చైనా)లో విడుదల చేసింది. 2016 డిసెంబర్ లో భారత్ లో విడుదల చేసిన కూల్1కు ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్. కూల్ ప్యాడ్ కూల్ 1 సహా భారత్ లోనూ పలు మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. కనుక త్వరలో కూల్ 2 కూడా మన మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉంటాయి.

ఈ ఫోన్ ప్రత్యేకత ఫుల్ స్క్రీన్. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు 18:9 రేషియోతో ఉంటుంది. మరో విశేషం ఈ ఫోన్ పై నీరు పడినా, దుమ్ము పడినా చెక్కు చెదరదు. 5.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 2.5 కర్వ్ డ్ గ్లాస్, 1.5 గిగాహెర్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ 6750 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, మైక్రో ఎస్డీ స్లాట్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నౌగత్ 7.0 ఓఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెనుక 13 మెగా పిక్సల్, 0.3 మెగాపిక్సల్ తో కాంబినేషన్ కెమెరాలు, ముందు 8 మెగా పిక్సల్ కెమెరా ఉంటాయి. ధర బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుందని అంచనా. 

  • Loading...

More Telugu News