Sri Reddy: 'వీ5' చానల్ హెడ్ కు యాక్సిడెంట్... కోపమున్నా సానుభూతి చూపిన శ్రీరెడ్డి!

  • ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన చానల్ హెడ్ మీరు
  • యాక్సిడెంట్ అయిందని విన్నాము
  • తోటి జర్నలిస్టుగా సానుభూతిని చూపిస్తున్నానన్న శ్రీరెడ్డి
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై తాను చేస్తున్న ఉద్యమాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారని గతంలో 'వీ5' చానల్ హెడ్ పై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి, ఇప్పుడాయనపై సానుభూతిని చూపింది. ఆ చానల్ హెడ్ కు యాక్సిడెంట్ కాగా, ఆ ఫొటోలను పోస్టు చేస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.

"మా మీద కరుడు కట్టిన కోపంతో వ్యతిరేక వ్యాఖ్యలతో మా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వీ5 చానల్ హెడ్ మీరు. మీకు నా ఇంటర్వ్యూ ఇవ్వలేదని మీరు మనసులో పెట్టుకుని ఉద్యమాన్ని డ్యామేజ్ చేశారని మా వాళ్లు చెప్పారు. మాకు ఎవరి మీదా కోపం లేదు. ఏదిఏమైనా మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాము. మాతోటి జర్నలిస్టుగా మీ మీద సానుభూతి చూపిస్తూ... మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని వ్యాఖ్యానించింది.
Sri Reddy
Casting Couch
Tollywood
VS
News Channel

More Telugu News