Tollywood: అమ్మాయిల దుస్తుల్లో హీరో.. అబ్బాయిలా హీరోయిన్‌.. ‘జంబ లకిడి పంబ’ మోషన్‌ పోస్టర్‌

  • మురళీ కృష్ణ దర్శకత్వంలో ‘జంబ లకిడి పంబ’
  • హీరోగా శ్రీనివాసరెడ్డి
  • అలరిస్తోన్న పోస్టర్‌
గతంలో వచ్చిన ‘జంబ లకిడి పంబ’ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అలరించిన విషయం తెలిసిందే. అదే టైటిల్‌తో, అటువంటి కథాంశంతో నటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్‌గా జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో మళ్లీ రెండున్నర గంటలు నవ్వులు పూయించడానికి మరో సినిమా వచ్చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ అలరించింది.

ఈ రోజు  ‘జంబ లకిడి పంబ’ మోషన్‌ పోస్టర్‌ను ఆ సినిమా యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో హీరో శ్రీనివాసరెడ్డి అమ్మాయిల దుస్తులు వేసుకుని సిగ్గుపడుతూ కనపడుతున్నాడు. ఇక అబ్బాయిలా దుస్తులు వేసుకున్న హీరోయిన్‌  సిద్ది ఇద్నాని గంభీరంగా కనపడుతోంది. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు.
Tollywood
srinivasa reddy
jambalakadipamba

More Telugu News