results: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. అగ్రస్థానంలో ప్రకాశం జిల్లా.. చివరి స్థానంలో నెల్లూరు

  • విడుదల చేసిన మంత్రి గంటా
  • 94.56 ఉత్తీర్ణత శాతంతో బాలికలదే పై చేయి
  • బాలుర ఉత్తీర్ణత శాతం 94.41

విశాఖపట్నంలోని ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాల్లో 94.56 ఉత్తీర్ణత శాతంతో బాలికలు పై చేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.41గా ఉంది. 97.93 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, నెల్లూరు జిల్లా 80.37 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 5340 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత శాతం సాధించాయి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా జూన్‌ 11 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  

More Telugu News