Mahesh Babu: ‘అరెరే ఇది కలలా ఉన్నదే’ పాట పాడిన మహేశ్‌ బాబు కూతురు సితార.. వీడియో వైరల్‌

  • వీడియో పోస్ట్ చేసిన నమ్రత
  • సితార పాటకు అభిమానులు ఫిదా
  • అద్భుతమంటూ ప్రశంసలు

మహేశ్ బాబు కూతురు సితార అప్పుడప్పుడు పాటలు పాడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె 'భరత్‌ అనే నేను' సినిమాలోని ఓ పాటను పాడింది. ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతోంది. ‘అరెరే ఇది కలలా ఉన్నదే..’ అంటూ చిట్టి సితార ముద్దు ముద్దుగా పాడుతోన్న పాటకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అద్భుతంగా పాడిందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఈ రోజు నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ‘భరత్‌ అనే నేను’ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది. 

More Telugu News