Kedarnath: ఆరు నెలల తరువాత తెరచుకున్న కేదార్ నాథ్ ఆలయం... మరిన్ని హంగులు!

  • ఆరు నెలల అనంతరం తెరచుకున్న దేవాలయం
  • లేజర్ లైట్ షో ప్రత్యేక ఆకర్షణ
  • ట్రెక్కింగ్ రూటులో విద్యుత్, వైద్య సదుపాయాలు

సంవత్సరంలో ఆరు నెలల పాటు మంచులో కప్పబడి ఉండే కేదార్ నాథ్ ఆలయం ఈ ఉదయం తెరుచుకుంది. ఈ ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తుల సందర్శనార్థం అనుమతించారు. ఈ సంవత్సరం కేదార్ నాథ్ కు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని, అనుభూతిని కల్పించేందుకు మరిన్ని హంగులు ఏర్పడ్డాయి. గౌరీకుండ్ నుంచి వచ్చే ట్రెక్కింగ్ మార్గంలో భక్తుల కోసం వైద్య, విద్యుత్‌, నీటి సదుపాయాలను ఏర్పాటు చేశామని ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ వెల్లడించారు.

ప్రతి కిలోమీటరుకూ డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఆలయం వద్ద శివుడిపై లేజర్ లైట్ షో ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం కేదార్ నాథ్ ఆలయం తెరచిన తొలిరోజున ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్‌లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. చార్ థామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు ఇప్పటికే తెరచుకోగా, బద్రీనాథ్ రేపు తెరచుకోనుంది.

More Telugu News