Telugudesam: చిత్తూరులో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు!

  • వచ్చేనెల చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
  • టీడీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోంది
  • అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఆర్‌పీ సిసోడియాను కలిసి, చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ తీరుపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో టీడీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వచ్చేనెల 21న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించాలని ఆయన తెలిపారు.

అయితే, బహిరంగ సభ పేరుతో టీడీపీ నేతలు మళ్లీ ఫ్లెక్సీలు పెడుతున్నారని, వారు అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడి మృతితో అక్కడి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News