vishal: విజయ్ .. అజిత్ ల గురించి విశాల్ ఏమన్నాడంటే .. !

  • విజయ్ అద్భుతంగా డాన్స్ చేస్తాడు 
  • అజిత్ డైలాగ్స్ చాలా బాగా చెబుతాడు
  • ఆయన అందుబాటులోకి రాకపోవడమే సమస్య
తమిళ చిత్రపరిశ్రమకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ .. వాటిని సాహసోపేతంగా విశాల్ అమలు పరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెరపైనే కాదు .. బయట కూడా ఆయన హీరో అనిపించుకుంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, స్టార్ హీరోలైన విజయ్ .. అజిత్ గురించి ప్రస్తావించాడు.

'విజయ్ మంచి నటుడు .. తమిళ చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన హీరో. ఆయన డాన్స్ చాలా అద్భుతంగా చేస్తాడు .. డాన్స్ లో ఆయనకి సాటిరాగల హీరో కోలీవుడ్ లో లేడు" అన్నారు. ఇక అజిత్ గురించి మాట్లాడుతూ .. " కోలీవుడ్ లోని గొప్ప నటుల్లో అజిత్ ఒకరు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో చాలా మంచి లక్షణాలు వున్నాయి. అయితే ఆయన అందుబాటులోకి రాకపోవడమే అతి పెద్ద సమస్య" అని చెప్పుకొచ్చాడు. 
vishal
vijay
ajith

More Telugu News