Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చెన్నయ్, ముంబయ్ మధ్య రకుల్ చక్కర్లు 
  • రజనీకాంత్ కూతురు చిత్రంలో రాజశేఖర్ 
  • ఆర్.ఎస్.ఎస్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు!    

*  అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ, క్షణం తీరిక లేకుండా వుంది. తమిళంలో సూర్య సరసన 'ఎన్.జి.కే' చిత్రంలోనూ, హిందీలో అజయ్ దేవగణ్ సరసన మరో చిత్రంలోనూ రకుల్ ప్రస్తుతం నటిస్తోంది. దీంతో ఈ షూటింగ్ అవగానే, ఆ షూటింగుకి .. అదవ్వగానే దీనికి .. అన్నట్టుగా ముంబయ్, చెన్నయ్ ల మధ్య చక్కర్లు కొడుతోంది.
*  'గరుడవేగ' విజయంతో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ త్వరలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుశ్ రూపొందించే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తాడని సమాచారం.
*  ఆర్.ఎస్.ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సంస్థ పుట్టుక, పరిణామం, విజయాలపై ఓ సినిమా రూపొందనుంది. లహరి ఆడియో సంస్థ అధినేత లహరి వేలు తులసి నాయుడు నిర్మించే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్టుతో ఇది నిర్మాణం జరుపుకుంటుందని తెలుస్తోంది.  

More Telugu News