Rajinikanth: స్టైల్‌ అంటే ఆయనదే... రజనీకాంత్‌ ఫొటోలు వైరల్‌

  • ఇటీవల హిమాలయాలకు వెళ్లిన రజనీ
  • ప్రస్తుతం అమెరికాలో
  • మెట్రోస్టేషన్‌లో అదిరిపోయే ఫొటోలు

సినీనటుడు రజనీకాంత్‌ని స్టైల్‌కే స్టైల్‌ నేర్పించే మాస్టర్‌గా ఆయన అభిమానులు పేర్కొంటారు. ఆయనను అభిమానులు అలా ఎందుకు పిలుచుకుంటారో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతుందనేలా తాజాగా రజనీకాంత్‌కు చెందిన కొన్ని ఫొటోలు ఉన్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. బ్లాక్ కలర్ టీషర్ట్ లో ఆయన అమెరికా మెట్రోస్టేషన్‌లో కనపడ్డారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన స్టైల్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కాగా, ఆయన నటించిన కాలా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.              

More Telugu News