komati reddy: 'కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వ నమోదు రద్దు'పై హైకోర్టులో విచారణ

  • సింగిల్ జడ్జ్‌ తీర్పును కొట్టవేయాలని అప్పీల్‌
  • టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు అప్పీలు చేసే అర్హత లేదన్న కోమటిరెడ్డి, సంపత్
  • సభ్యులు కాబట్టి అప్పీలు అర్హత ఉంటుందన్న న్యాయవాది

కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వ నమోదు రద్దుపై సింగిల్ జడ్జ్‌ తీర్పును కొట్టివేయాలని ఇటీవల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. దీనిపై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు అప్పీలు చేసే అర్హత లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల తరఫు న్యాయవాది అన్నారు.

అయితే, శాసన సభ్యులు కాబట్టి అప్పీలు అర్హత ఉంటుందని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల న్యాయవాది వాదించారు. అలాగే, కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు అసెంబ్లీ ప్రవర్తించిన తీరుపై మీడియాలో ప్రసారమైన వీడియోలను సదరు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. దీంతో శాసన సభ్యత్వం రద్దు చేసే ముందు సదరు ఎమ్మెల్యేల వివరణ తీసుకోవాలి కదా? అని కోర్టు ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

More Telugu News