praveen sattharu: ప్రవీణ్ సత్తారు సెంటిమెంట్ .. రామ్ తో మళ్లీ అక్కడే షూటింగ్

  • స్రవంతి బ్యానర్లో హీరోగా రామ్
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • వచ్చేనెల 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ 

'గరుడ వేగ' సినిమా దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు సత్తాను చాటి చెప్పింది. ఆ సినిమా షూటింగును ఆయన జార్జియాలో మొదలుపెట్టారు. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో, తన తదుపరి సినిమా విషయంలోను అదే సెంటిమెంట్ ను ప్రవీణ్ సత్తారు పాటిస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం రామ్ తో వున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

తొలి షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. ఆ తరువాత ఫ్రాన్స్ .. ఇటలీ .. స్విట్జర్లాండ్ .. లడఖ్ .. కశ్మీర్ ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తాము అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువవుతుందనే ఉద్దేశంతో భవ్య క్రియేషన్స్ వారు ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకోవడంతో, స్రవంతి రవికిశోర్ రంగంలోకి దిగారు.   

More Telugu News