media: ఇలాంటి అతి దారుణ ఘట‌న‌లు మీడియా లేక‌పోతే బ‌య‌ట‌కి వచ్చేవే కావు: మ‌ల్లికా శెరావ‌త్

  • క‌థువా, ఉన్నావో లాంటి ఘటనలపై బాలీవుడ్‌ నటి స్పందన
  • గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తి తిరిగిన దేశం భార‌త‌దేశం 
  • ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారింది
  • మీడియా ఒత్తిడి వ‌ల్లే కొత్త చట్టం వచ్చింది

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో చిన్నారిపై దారుణ హత్యాచారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో‌లో బీజేపీ ఎమ్మెల్యే ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డ ఉదంతాలపై దేశంలోని మహిళా ఆర్టిస్టులు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి మ‌ల్లికా శెరావ‌త్.. ఈ విషయంతో పాటు దేశంలో జ‌రుగుతోన్న అత్యాచార ఘ‌ట‌న‌లపై మాట్లాడింది. మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తి తిరిగిన ఈ భార‌త‌దేశం ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సమయంలో ప్ర‌జ‌లందరూ మీడియాపైనే ఆశ‌లు పెట్టుకున్నారని, క‌థువా, ఉన్నావో లాంటి  దారుణ ఘట‌న‌లు మీడియా లేక‌పోతే బ‌య‌ట‌కి వచ్చేవే కావని మల్లికా శెరావత్ అన్నారు. దేశంలోని మీడియా ఒత్తిడి వ‌ల్లే బాలికలపై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాల‌న్న కొత్త చ‌ట్టం వచ్చిందని, అది మీడియా గొప్పదనమేనని వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతోన్న అత్యాచార ఘటనలు ఆందోళనకరమని అన్నారు.

More Telugu News