TRS: సభ పెట్టిర్రా... సర్కస్ పెట్టిర్రా?: ప్లీనరీలోకి రాగానే కేసీఆర్ ఆగ్రహం

  • ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
  • కూలర్ల గాలికి ప్రసంగాలు వినిపించని పరిస్థితి
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నేడు ప్రారంభమైన ప్లీనరీలో ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో వక్తలు మాట్లాడింది ఎవరికీ వినపడని పరిస్థితి నెలకొందని, ఏర్పాట్లు పర్యవేక్షించిన రాజేశ్వర్ రెడ్డిని పిలిచి చెప్పారు. సభా వేదికపైకి వచ్చిన కేసీఆర్ కు ఎవరు ఏం మాట్లాడుతున్నారన్నది వినపడక పోవడంతో, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"రాజేశ్వర్ రెడ్డిగారూ... ఇప్పుడు సారయ్య మాట్లాడింది ఎవరికైనా అర్థం అయిందా? ఆ ఏం లొల్లయ్యా నాకు అర్థం కాదు. బంద్ చేయవయ్యా బాబూ... ఆ సౌండ్ వాళ్లు ఎవళ్లయ్యా బాబూ... సౌండ్ వాళ్లు లేరా? బాలమల్లయ్యా... ఆ ఏసీలు బంద్ చేయించయ్యా బాబూ... ఏం సభ పెట్టిర్రా లేక తమాషా సర్కస్ పెట్టిర్రా? బంద్ చేపిమన్నాకదా? గంట పడతదా దానికి? చెప్పబట్టి పావుగంటైంది కదా? చేపీ... ఏసీలు బంద్ చేపీ. ఏం వినపడతలేదయ్యా బాబూ... తమాషానా? అంత రొద ఉంటే ఎలా వినిపడతది?" అన్నారు.

కాగా, సభా ప్రాంగణంలో హై స్పీడ్ కూలర్లను ఏర్పాటు చేయడంతో వాటి గాలికి ఎవరు ఏం మాట్లాడుతున్నారన్న విషయం వినపడకపోగా కేసీఆర్ ఇలా స్పందించారు. ఆపై తాను మాట్లాడేటప్పుడు 'ఎకో' ఎందుకంటూ సౌండ్ ఇంజనీర్ పై మండిపడ్డారు.

More Telugu News