iphone 8: ఐఫోన్ 8, 8ప్లస్ లో రెడ్ వేరియెంట్ వచ్చేసింది!

  • 64జీబీ, 256జీబీ స్టోరేజీతో అందుబాటు
  • ధరలు రూ.67,940 నుంచి రూ.91,110 వరకు
  • ప్రీ ఆర్డర్ తీసుకుంటున్న ఫ్లిప్ కార్ట్

యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్పెషల్ ఎడిషన్ కింద రెడ్ కలర్ లో విడుదల చేసింది. ప్లిప్ కార్ట్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్ కింద బుకింగ్ తీసుకుంటోంది. యాపిల్ ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.77,560 కాగా, ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ ధర రూ.67,940. 256 జీబీ యాపిల్ ఐఫోన్8 ప్లస్ వేరియంట్ ధర రూ.91,110. 256జీబీ స్టోరేజీ గల ఐఫోన్8 ధర రూ.81,500. ఈ నెల 30 నుంచి సేల్స్ మొదలవుతాయి. ఐఫోన్ 8, 8ప్లస్ ఇప్పటికే సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ రకాల్లో లభిస్తోంది.

  • Loading...

More Telugu News