Karnataka: రాహుల్ ను హత్య చేయాలని కుట్ర: కాంగ్రెస్ సంచలన ఆరోపణ

  • రాహుల్ విమానంలో సాంకేతిక లోపం
  • ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే
  • పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా తిరుగుతున్న రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటం వెనుక కుట్ర దాగుందని కాంగ్రెస్ సంచలన ఆరోపణ చేసింది. విమానయాన రంగంలో సాంకేతిక లోపం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన అంశమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఈ మేరకు ఫిర్యాదును పోలీసులకు సమర్పించగా, ఎఫ్ఐఆర్ దాఖలైంది.

రాహుల్ పై కుట్ర జరిగిందన్నది తమ ఆరోపణని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని కొట్టిపారేయలేమని అన్నారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతోనే ఆయన క్షేమంగా నేలపై దిగారని అన్నారు. సాంకేతిక లోపం ఏర్పడి, ఆటోపైలట్ పనిచేయకపోవడం వెనుక కుట్ర ఏమైనా జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిన్న రాహుల్ విమానం రెండు సార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమై, మూడోసారి హుబ్లీ విమానాశ్రయంలో క్షేమంగా దిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News