Guntur District: గుంటూరులో రైతులతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ భేటీ

  • గుంటూరులో పర్యటిస్తోన్న లక్ష్మీ నారాయణ 
  • సాదరస్వాగతం పలికిన యాజలి గ్రామస్తులు
  • విస్తృతంగా ప్రజల్లోకి వెళుతోన్న సీబీఐ మాజీ జేడీ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ రోజు గుంటూరులో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. పదవీ విరమణ తరువాత ఆయన తొలి సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని కర్లపాలెం మండలం యాజలి గ్రామ రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారులతో ఆయన భేటీ అయి చర్చిస్తున్నారు. అంతకు ముందు ఆయనకు రైతులు, గ్రామస్తులు సాదరస్వాగతం పలికారు.

యాజిలిలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో లక్ష్మీ నారాయణ గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తాను తొలుత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పిన లక్ష్మీ నారాయణ.. ఇకపై సొంతంగా పార్టీ పెట్టనున్నారా? లేక రాజకీయాల్లోకి రాకుండానే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారా? అన్న ఆసక్తి నెలకొంది.   
Guntur District
laxmi narayana
farmers

More Telugu News