suddala ashok teja: 'ఠాగూర్' కోసం రాసిన పాట వినిపించగానే చిరంజీవి అలా అన్నారు: సుద్దాల అశోక్ తేజ

  • 'ఠాగూర్' సినిమా కోసం పిలిపించారు 
  • శ్రీశ్రీ తరహాలో రాయమని చెప్పారు 
  • ఒక్క అక్షరం మార్చకుండా ఓకే చేశారు  

సుద్దాల అశోక్ తేజ పాటల్లో ఆవేశం కనిపిస్తుంది .. జానపదం వినిపిస్తుంది. తనకి శ్రీశ్రీ శైలి ఇష్టమని చెప్పే సుద్దాల అశోక్ తేజ, అదే శైలిలో 'ఠాగూర్' లో ఒక పాట రాయవలసి వచ్చింది. ఆ విషయాన్ని గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు. "ఠాగూర్' సినిమాకి నాతో ఒక పాట రాయించాలని అనుకున్న తరువాత నన్ను చిరంజీవి గారు పిలిపించారు. శ్రీశ్రీగారి 'నేను సైతం' అనే వాక్యం నేను ఇది వరకు 'రుద్రవీణ'లో రాయించుకున్నాను. ఈ సినిమాలో మళ్లీ వాడితే బాగుంటుందని అనిపిస్తోంది అన్నారు.

 'నేను సైతం .. ' అంటూ పల్లవిని మొదలు పెట్టి .. ఆ స్థాయికి తగ్గకుండగా చరణాలు వుండాలని చెప్పారు. శ్రీశ్రీ బ్రతికి వుంటే ఎలా రాసి ఉండేవారో ఊహించుకున్నాను. శ్రీశ్రీని ఆవాహన చేసుకుని 10 .. 12 నిమిషాల్లో ఆ పాట రాశాను .. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఆ పాట ఓకే అయింది. ఆ పాట వినిపించినప్పుడు 'చూడు అశోక్, నా రోమాలు ఎలా నిక్కబొడుచుకుంటున్నాయో .. అద్భుతంగా రాశావు' అంటూ చిరంజీవి గారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. అద్భుతంగా రాశావని ఆయన అనడమే ఫస్టు నేషనల్ అవార్డు .. ఆ తరువాత నిజంగానే నాకు నేషనల్ అవార్డు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News