FACEBOOK: ఏ డేటా కొట్టేశారు...అందుకు ఏ ఉపకరణాలు వాడారు...?: కేంబ్రిడ్జ్ సంస్థకు నోటీసులు పంపిన కేంద్ర సర్కారు

  • ఫేస్ బుక్ కు కూడా జారీ
  • ఇది రెండో విడత నోటీసులు
  • తొలి విడిత నోటీసులకు ఇచ్చిన వివరణల్లో అస్పష్టత, లోపాలు

ఫేస్ బుక్ యూజర్ల డేటా చోరీ విషయమై ఆ సంస్థకు, సమచాారాన్ని చోరీ చేసిన కేంబ్రిడ్జ్ అనలైటికా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు పంపించింది. గతంలో ప్రభుత్వం పంపిన నోటీసులకు ఈ సంస్థలు బదులిచ్చాయి. అందులో లోపాలున్నాయని గుర్తించిన సర్కారు తిరిగి నోటీసులు జారీ చేసింది. అదనపు ప్రశ్నలకు వచ్చే నెల 10వ తేదీలోపు వివరణలు తెలియజేయాలని కోరింది.

ప్రభుత్వం పంపిన తొలి నోటీసుకు కేంబ్రిడ్జ్ అనలైటికా చెప్పీ చెప్పనట్టు, తప్పించుకునే తీరులో స్పందన తెలియజేసింది. దీంతో మరో ఐదు ప్రశ్నలను సంధిస్తూ నోటీసు పంపింది. భారత్ కు సంబంధించి ఏ తరహా సమాచారం సేకరించారు, సదరు డేటాను కొట్టేయడానికి వాడిన ఉపకరణాలు ఏంటని ప్రశ్నించింది. అటు ఫేస్ బుక్ స్పందన సైతం లోపాలమయంగానే ఉండడంతో మరిన్ని వివరణలు కోరింది. 5.62 లక్షల మంది యూజర్ల సమాచారం లీక్ అయినట్టు ఫేస్ బుక్ అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

More Telugu News