ram: రామ్ నెక్స్ట్ మూవీ లాంచ్ .. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు

  • రామ్ హీరోగా 'హలోగురు ప్రేమకోసమే'
  • ప్రవీణ్ సత్తారుతో నెక్స్ట్ మూవీ
  • వచ్చేనెల 6 నుంచి రెగ్యులర్ షూటింగ్  

'గరుడ వేగ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, తన తదుపరి సినిమాను రామ్ తో ప్లాన్ చేసుకున్నాడు. స్రవంతి రవికిశోర్ నిర్మించే ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. మాళవిక శర్మ కథానాయికగా నటించనున్న ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఇంతవరకూ తాను చేయని కాన్సెప్ట్ కావడంతోనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక 'గరుడ వేగ' మాదిరిగానే .. కొత్తదనంతో ఈ సినిమాను అందించే పట్టుదలతో ప్రవీణ్ సత్తారు వున్నాడు. ప్రస్తుతం రామ్ .. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలోగురు ప్రేమ కోసమే' చేస్తోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News