china: ప్రధాని మోదీ చైనా పర్యటన నేడే

  • 27, 28 తేదీల్లో జిన్ పింగ్ తో భేటీ
  • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి
  • చారిత్రాత్మకంగా నిలిచిపోతుందున్న అంచనాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన కోసం నేటి సాయంత్రం బయల్దేరి వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తో వుహాన్ సిటీలో 27, 28 తేదీల్లో భేటీ అవుతారు. ఇరు నేతల కలయిక చారిత్రాత్మక సమావేశం అవుతుందని విశ్లేషకులు, రెండు దేశాలు భావిస్తున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ సైతం చైనా-భారత్ సంబంధాల్లో ఈ పర్యటన ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని ఇప్పటికే ప్రకటన చేశారు.

గతేడాది సిక్కిం సరిహద్దు ప్రాంతం డోక్లామ్ లోకి చైనా చొరబాటుతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం విదితమే. తాజా సమావేశంలో సంబంధాల బలోపేతంపై అగ్రనేతలు దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే తప్ప ఎటువంటి ఒప్పందాలు జరగడం లేదు. జూన్ లో క్వింగ్డావ్ సిటీలో షాంఘై కో-ఆపరేషన్ సదస్సుకు ముందు జరిగే ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

More Telugu News